జిల్లా టాపర్ గా లక్ష్మీ మౌనిక


 
  ఒక టైలర్ కూతురు జిల్లాకు టాప్. 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల లో జరిగిన గ్రామ సచివాలయం   పరీక్ష ఫలితాలలో పంచాయతీ సెక్రటరీ కేటగిరి -1లో నెల్లూరు నగరంలోని కిసాన్ నగర్ ప్రాంతం నివాసి అయిన బొద్దుకూరు లక్ష్మీ మౌనిక శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా టాపర్ గా నిలిచింది.
         ఈ అమ్మాయి నెల్లూరు ట్రంకురోడ్ లో ఉన్న ప్రముఖ రిట్జ్ టైలర్ షాపులో టైలర్ పనిచేస్తున్న  బొద్దుకూరు చంద్ర కూతురు కావడం గర్వించదగ్గ విషయం. చదువులతల్లికి అందరూ సమానమే. చదువుకు కులము, మతము , ధనిక , పేద అన్న తేడాలు లేవు అని నెల్లూరు జిల్లాకు టాపర్ అయిన బొద్దుకూరు లక్ష్మీ మౌనిక నిరూపించింది.